- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మన్సూరాబాద్: కళాశాల పక్కనే నడిరోడ్డుపై మూత్ర విసర్జన
దిశ, మన్సూరాబాద్: సమస్య చాలా చిన్నది, కానీ అందరికీ చెప్పుకోలేనిది. అభివృద్ధి పేరుతో కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం పబ్లిక్ టాయిలెట్స్ విషయంలో విఫలమవుతుంది. ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నవారు మహిళలే. వీళ్లు పడే నరకయాతనకు నిదర్శనం నేషనల్ హైవే కు ఆనుకొని ఉన్న చింతలకుంట సరస్వతి నగర్ కాలనీ నిదర్శనం. కళాశాలకు వెళ్లే విద్యార్థినిలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అటుగా వెళ్లాలంటే దుర్వాసనతో ముక్కు ముసుకుంటున్నారు.
రోడ్డు పైనే మూత్ర విసర్జన
ఎల్బీనగర్ నుంచి విజయవాడ వైపు వెళ్లే ప్రయాణికులు అక్కడే మూత్ర విసర్జన చేస్తుంటారు. అక్కడనే టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడంతో వేలాదిగా బస్సులు వచ్చివెళ్తుంటాయి. ఈ క్రమంలో ప్రయాణికులు, డ్రైవర్లు టాయిలెట్స్ లేక రోడ్డుపైనే మూత్ర విసర్జన చేస్తుంటారు.
పట్టించుకోని అధికారులు
కోట్ల రూపాయలు ఖర్చు చేసి పనికిరాని చోటల్లా పబ్లిక్ టాయిలెట్స్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ నిత్యం మహిళలు, విద్యార్థినిలు, ప్రయాణికులు తిరుగుతుంటారు. ఇలాంటి చోట ఏర్పాటు చేయాల్సిన అధికారులు పట్టించుకోకుండా చోద్యం చూస్తున్నారు.
పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి
సమస్యను దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని మహిళలు, విద్యార్థినిలు, స్థానిక కాలనీవాసులు సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
- Tags
- Mansurabad