- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారిన కేసీఆర్ స్కీమ్స్
దిశ ప్రతినిధి, వరంగల్ : హుజురాబాద్ ఉప ఎన్నికను లక్ష్యంగా చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళితబంధు స్కీం, రెండో విడత గొర్రెల పంపిణీ పథకం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు బెడిసికొడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని కోరుతూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుంతుండటం గమనార్హం. వరంగల్ జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉంది. ముఖ్యంగా జనగామ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన పాలకుర్తి ఎమ్మెల్యే, పంచాయతీరాజ్‌శాఖ ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిలు, వర్ధన్నపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిలు సోషల్ మీడియాలో ట్రోలవుతున్నారు.
మా ఎమ్మెల్యే రాజీనామా చేయాలి.. మాకు వేల కోట్ల ఫండ్ తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నామంటూ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. వాట్సాప్ గ్రూపుల్లోనూ చర్చ జరుగుతుండటం గమనార్హం. జనగామ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రబెల్లి, తాటికొండ, ముత్తిరెడ్డిలు రాజీనామా చేయడం వలన జిల్లాలోని దళితులందరికీ రూ.10లక్షలతో పాటు దాదాపు రూ.6000 కోట్ల లబ్ధి చేకూరుతుందని ఓ పోస్టు డిజైన్ చేసి మరీ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది ఇప్పుడు వైరల్‌గా మారింది. దీంతో మంత్రి ఎర్రబెల్లితోపాటు స్థానిక ఎమ్మెల్యేలకు కొత్త తలనొప్పి మొదలైనట్టయింది.