- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నడి రోడ్డు మీద కూర్చోబెట్టి నరికాడు
దిశ, వెబ్‌డెస్క్: ఓ యువకుడు అమ్మాయిపై పెంచుకున్న ప్రేమ ‘పగ’గా మారింది. ఆ పగే యమపాశమై యువతి మెడలో కత్తి పోట్లను దించింది. ప్రేమించడానికి నిరాకరించిందన్న కోపంతో ప్రేమికుడు కాస్తా ఉన్మాదిగా మారాడు. పువ్వులతో వెంటబడిన అతడు ఆ తర్వాత కత్తులతో వేటాడాడు. అదును చూసి మెడపై ఒక్క వేటు వేశాడు అంతే.. దీంతో ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలింది. ఓ వైపు నడి రోడ్డుపై రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతి, మరో వైపు ఆమెను చంపేందుకే కత్తి పట్టుకున్న దృశ్యం భయబ్రాంతులకు గురిచేసింది. ఈ ఘటన కర్ణాటకలోని హుబ్లీ పట్టణంలో కలవరం సృష్టించింది.
వివరాళ్లోకి వెళితే..
కర్ణాటకలోని హుబ్లీ పట్టణానికి చెందిన యువకుడు ఇస్మాయిల్ స్థానికంగా ఉండే ఓ యువతిని ప్రేమ పేరుతో వేధించసాగాడు. ఎంతకీ తన ప్రేమను ఒప్పుకోకపోవడంతో సదరు యువతిపై కక్ష పెంచుకున్నాడు. దీంతో సోమవారం యువతి ఒంటిరిగా వెళ్లడం గమనించిన ఇస్మాయిల్ తన వెంటతెచ్చుకున్న తల్వార్‌తో దాడి చేశాడు. నడి రోడ్డు మధ్యలోనే కూర్చొబెట్టి మెడపై బలంగా ఒక వేటు వేశాడు. అప్పటికే తీవ్రగాయాలైన యువతి కుప్పకూలింది. అయినప్పటికీ ఇస్మాయిల్ బలంగా మరో వేటు వేశాడు. మరో వేటు వేసే లోపలే పలువురు వాహనదారులు దైర్యం చేసి నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేసి ఎట్టకేలాకు శాంతిపజేశారు. వెంటనే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు యువతిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.