సంక్రాంతి బరిలో పవర్ స్టార్.. ఇక రికార్డుల వేటే!

by Jakkula Samataha |
సంక్రాంతి బరిలో పవర్ స్టార్.. ఇక రికార్డుల వేటే!
X

దిశ, సినిమా : రీ ఎంట్రీ తర్వాత వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకుపోతున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. సమ్మర్‌లో ‘వకీల్ సాబ్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. దీంతో పాటు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీలోనూ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తున్నాడు పవన్. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ స్పాట్ నుంచి విడుదలైన పవన్ పిక్ తెగ వైరల్ అయింది కూడా. పవన్ లుక్ అభిమానులకు మంచి కిక్ ఇవ్వగా, సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈ మేరకు పవన్ ఈసారి బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించడం ఖాయమని అభిమానులు సంబరపడుతున్నారు. కాగా తమ అభిమాన నటుడ్ని పీరియాడిక్ బ్యాక్‌డ్రాప్ చిత్రంలో 70ఎమ్‌ఎమ్ తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్ న్యూస్ అందించారు. పవర్‌స్టార్ ఈ సారి సంక్రాంతి బరిలో నిలిచి, తన స్టామినా చూపించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో పవన్ సరసన ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ నటిస్తుండగా, పవన్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌లో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాకు ‘హరిహర వీరమల్లు’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఏఎం.రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్ర ఫస్ట్ లుక్, టైటిల్ మహా శివరాత్రి పర్వదినాన రిలీజ్ కానుందని ఫిల్మ్ నగర్ వర్గాల టాక్.

Advertisement

Next Story