- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జూన్ 9 నుంచి పీఎస్ఎల్ 6.. ఆలస్యానికి ఇదే కారణం
దిశ, స్పోర్ట్స్ : కరోనా కారణంగా వాయిదా పడిన పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ (పీఎస్ఎల్) 6వ సీజన్ జూన్ 9 నుంచి అబుదాబి వేదికగా ప్రారంభం కానున్నట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. మూడు నెలల క్రితం పాకిస్థాన్‌లోనే పీఎస్ఎల్ 6 ప్రారంభించగా 14 మ్యాచ్‌ల అనంతరం కరాచీలో ఏర్పాటు చేసిన బయోబబుల్‌లో కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో లీగ్‌ను అర్దాంతరంగా రద్దు చేశారు. కాగా అబుదాబి వేదికగా లీగ్ నిర్వహించడానికి అనుమతులు రావడంతో గత నెలలోనే పాకిస్థాన్ క్రికెటర్లు, సిబ్బందితో పాటు ఇండియా నుంచి బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బంది యూఏఈ చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1 నుంచి పీఎస్ఎల్ ప్రారంభం కావల్సి ఉండగా.. ఇండియాకు చెందిన బ్రాడ్‌కాస్టింగ్ సిబ్బందిని అబుదాబిలోకి అనుమతించడం కుదరదని చెప్పింది.
అబుదాబి కాకుండా మరో చోట క్వారంటైన్ ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో ఇండియాకు చెందిన బ్రాడ్‌కాస్ట్ సిబ్బంది వచ్చే వరకు లీగ్ షెడ్యూల్ ప్రకటించలేదు. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యూఏఈ ప్రభుత్వంతో మాట్లాడి సిబ్బంది క్వారంటైన్‌ను తగ్గించారు. దీంతో జూన్9 నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయని పీసీబీ ప్రకటించింది. జూన్ 24న ఫైనల్ నిర్వహిస్తామని.. ఆరు డబుల్ హెడర్లతో పాటు, ఒక క్వాలిఫయర్, ఒక ఎలిమినేటర్ జూన్ 21న జరుగుతుందని చెప్పింది. పాకిస్థాన్ జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉన్నందునే.. 15 రోజుల్లో మిగిలిన మ్యాచ్‌లు ముగించనున్నారు.