ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2,867 ఫ్రాడ్ కేసులు..!

by  |
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 2,867 ఫ్రాడ్ కేసులు..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSB)మొత్తం 2,867 కేసుల్లో రూ. 19,964 కోట్ల విలువైన మోసాలను నమోదు చేసినట్టు ఆర్‌టీఐ (RTI) ద్వారా తెలిసింది. దేశీయ అతిపెద్ద ప్రభుత్వ యాజమాన్య సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State Bank of India) అత్యధిక ఫ్రాడ్ కేసులను చూసింది.

ఆర్‌టీఐ కార్యకర్త చంద్రశేఖర్‌కు రిజర్వ్ బ్యాంక్ (Reserve bank)ఇచ్చిన సమాధానం ప్రకారం.. విలువ పరంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) ఘోరంగా దెబ్బతిన్నదని తెలుస్తోంది. మొత్తం 12 పీఎస్‌బీల్లో ఎస్‌బీఐ 2020, ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో గరిష్ఠంగా 2,050 ఫ్రాడ్ కేసుల్లో రూ. 2,325.88 కోట్లను నమోదు చేసింది. విలువ పరంగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India) మొత్తం 47 కేసుల్లో రూ. 5,124.87 కోట్లతో అత్యధిక మోసాలను నమోదు చేసింది. తర్వాతి స్థానాల్లో కెనరా బ్యాంకు (canara bank)33 కేసులతో రూ. 3,885.26 కోట్లు, బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of baroda) 60 కేసుల్లో రూ. 2,842.94 కోట్లు, ఇండియన్ బ్యాంక్ (Indian Bank) 45 కేసుల్లో రూ. 1,469.79 కోట్లు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian overseas bank) 37 కేసుల్లో రూ. 1,207.65 కోట్లు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharastra) 9 కేసుల్లో రూ. 1,140.37 కోట్ల మోసాలను నమోదు చేసినట్టు తెలుస్తోంది.

వీటితో పాటు రెండో అతిపెద్ద ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ (Punjab natioanl bank)లో కేసుల సంఖ్య 240 ఉన్నప్పటికీ వాటి విలువ రూ. 270.65 కోట్లతో తక్కువ మోసాలను నివేదించింది. మిగిలిన బ్యాంకుల్లో యూకో బ్యాంక్ (UCo Bank) మొత్తం 130 కేసుల్లో రూ. 831.35 కోట్లు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India) 149 కేసుల్లో రూ. 655.84 కోట్లు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకు (Punjab and Sindhu Bank)18 కేసుల్లో రూ. 163.3 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Union bank of India) అత్యల్పంగా 49 కేసుల్లో రూ. 46.52 కోట్ల మోసాలను నమోదు చేశాయి.



Next Story