- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలు..!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి సవాళ్ల నేపథ్యంలో బ్యాంకింగ్ సేవలను వినియోగదారుల వద్దకే తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు(పీఎస్‌బీ) సంయుక్తంగా కొత్త సంస్థను ఏర్పాటు చేశాయి. దీనికోసం ‘పీఎస్‌బీ అలయన్స్ ప్రైవేట్ లిమిటెడ్’ పేరుతో ఈ సంస్థ ప్రారంభం కానుంది. ఇందులో 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్(ఎస్ఓపీ) కింద బ్యాంకింగ్ కరస్పాండెంట్లు వినియోగదారుల ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను అందించనున్నారు. ఈ కొత్త సంస్థకు ఎస్‌బీఐ మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, రిలయన్స్ జియో పేమెంట్స్ బ్యాంక్ డిప్యూటీ సీఈఓ రాజిందర్‌లు సీఈఓలుగా నియమితులయ్యారు.
‘ప్రస్తుతం వేర్వేరు పీఎస్‌బీలు ‘డొర్ స్టెప్ బ్యాంకింగ్’ సేవలను సొంత బ్యాంకింగ్ కరస్పాండెంట్లను నియమించుకుంటున్నాయి. కొత్త సంస్థ ఏర్పాటు ద్వారా తక్కువ వ్యయంతో కరస్పాండెంట్ల సేవలను అన్ని పీఎస్‌బీలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుందని’ రాజిందర్ వివరించారు. ఈ కొత్త సదుపాయాల ద్వారా అకౌంట్ స్టేట్‌మెంట్లు, పికప్ చెక్స్, టీడీఎస్ సర్టిఫికేట్ లాంటి ఆదాయ పన్ను పత్రాల కోసం దరఖాస్తు, పే ఆర్డర్‌ల డెలివరీ లాంటి 11 రకాల ఆర్థికసేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ కోసం కూడా అప్లై చేయవచ్చు. ప్రస్తుతం క్యాష్ విత్‌డ్రాయల్స్ సేవలు అందిస్తున్నారు. పీఎస్‌బీ వినియోగదారులు ఓటీపీ ధృవీకరణ ద్వారా వెబ్, యాప్, ఫోన్ ద్వారా ఈ సేవలను కోరవచ్చు. కాగా, పీఎస్‌బీ అలయన్స్’ సంస్థ రూ. 14 కోట్ల మూలధనం కలిగి ఉంది.