పీఎఫ్ ఖాతాలపై కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..

by Harish |
nirmala-seetharaman
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రం కొత్త ఆదాయపు పన్ను నిబంధనల్లో మార్పులు చేసింది. ఇందులో భాగంగా ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాలుగా రెండు వేర్వేరు ఖాతాలను విభజిస్తూ నిబంధనలను నోటిఫై చేసింది. ఈపీఎఫ్ ఖాతాల్లోని మొత్తంపై వచ్చే వడ్డీకి పన్ను విధించేందుకు ఈ నిబంధనలను మార్చింది. 2021-22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించినట్టుగా ప్రతి ఏటా రూ. 2.5 లక్షలకు మించి పీఎఫ్ అకౌంట్లలో జమయ్యే వారికి పన్ను విధించేందుకు సిద్ధమవుతోంది. దీని ద్వారా ఉద్యోగులు తమ వాటా పీఎఫ్ అకౌంట్‌లో ఏడాదికి రూ. 2.5 లక్షల కంటే అధికంగా జమ చెస్తే ఆ మొత్తంపై వడ్డీకి ఆదాయపు పన్ను చెల్లించక తప్పదు.

అందుకోసమే పీఎఫ్ ఖాతాలను రెండూ వెర్వేరుగా ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రత్యక్ష పన్ను బోర్డు(సీబీడీటీ) నిబంధనలను విడుదల చేసింది. ఇందులో ఒకటి పన్ను విధించే ఖాతా, పన్ను మినహాయింపు ఖాతాగా పరిగణించనున్నారు. ఈ కొత్త నిబంధనలు ప్రస్తుత ఏడాది మార్చి 31 నుంచి అమలవుతుంది. ఈ నేపథ్యంలో పీఎఫ్ ఖాతాలను రెండు రకాలుగా విభజించడం అదనపు శ్రమ అవుతుందని, దీనివల్ల ప్రయోజనాలు తక్కువని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Next Story