‘ప్రజల ప్రాణాలను ప‌ణంగా పెడుతున్న ప్రధాని’

by Sridhar Babu |
‘ప్రజల ప్రాణాలను ప‌ణంగా పెడుతున్న ప్రధాని’
X

దిశ, ఖమ్మం: దేశ ప్ర‌జ‌ల ప్రాణాలను పణంగా పెట్టి ప్ర‌ధాని మోడీ ఏకపక్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నార‌ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్‌రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు విమర్శించారు. మంగళవారం దేశవ్యాప్తంగా సీపీఐ(ఎం) జాతీయ కమిటీ పిలుపు మేరకు నిర్వహించిన నిరసనల్లో భాగంగా సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాయం ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం పోతినేని సుదర్శన్ రావు మాట్లాడారు. దేశంలో అశాస్త్రీయంగా, అనాలోచితంగా తీసుకున్న లాక్‌డౌన్‌ నిర్ణయం కారణంగా కోట్లాది మంది ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు.


Advertisement
Next Story

Most Viewed