గవర్నర్ నివాసం ముందు గొర్రెలతో నిరసన

by Shamantha N |
Protest in Bengal Raj Bhavan
X

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌కర్ అధికారిక నివాసం రాజ్‌భవన్ ముందు ఓ వ్యక్తి గొర్రెలతో నిరసన చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల్లో తీవ్ర నిర్లక్ష్యమున్నా గవర్నర్ ఉదాసీనతగా వ్యవహరిస్తు్న్నారని ఓ వ్యక్తి ఎనిమిది గొర్రెలను వెంటబెట్టుకొచ్చి నిరసనకు దిగారు. నారదా కేసులో టీఎంసీ మంత్రులపై దర్యాప్తునకు సీబీఐకి అనుమతి ఇచ్చిన తరుణంలో గవర్నర్‌ తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. సోమవారం కూడా రాజ్‌భవన్ ముందు నిరసనలు జరిగాయి. కానీ, మంగళవారం గొర్రెలతో చేసిన నిరసనపై గవర్నర్ ధన్‌కర్ ఆగ్రహించారు. కోల్‌కతా పోలీసులకు లేఖ రాసి వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రాజ్‌భవన్ ముందే లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిందని, గొర్రెలతో ఒకరు నిరసన చేస్తుంటే పోలీసులు, అధికారులు డ్రామా చూసినట్టు చూశారని, బాధ్యతలు విస్మరించారని ఆరోపించారు. ఆ నిరసనకారుడిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే వెళ్లిపోవడానికి అనుమతినిచ్చారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed