- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘మూడు నెలల విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి’
దిశ, ఖమ్మం: కరోనా మూలంగా గడిచిన మూడు నెలల నుంచి విద్యుత్ ఉద్యోగులు రీడింగ్ సరైన సమయంలో తీయకపోవడంతో స్లాబులు మారిపోయి వినియోగదారులకు అధికంగా బిల్లులు వస్తున్నాయని సీపీఐ, సీపీఐఎంఎల్, న్యూడెమోక్రసీ నేతలు ఆరోపించారు. ప్రజలపై కరెంటు బిల్లుల భారం పడకుండా మూడు నెలల విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని కోరుతూ సీపీఐ, సీపీఐఎంఎల్, న్యూ డెమోక్రసీ నేతలు ఖమ్మంలోని విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, న్యూడెమోక్రసీ నాయకులు ఆవుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ… ఓ పక్క కరోనాతో అనేక రకాల ఇబ్బందులకు గురి అవుతున్న ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ బిల్లుల భారం మోపడం సరైంది కాదన్నారు. జీరో యూనిట్ నమోదైన మీటర్లకు కూడా వేలల్లో బిల్లు ఇవ్వటం జరిగిందన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు విద్యుత్ బిల్లులు కూడా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.