‘సీఎస్ ఆదేశాలను రద్దు చేయాలి.. ప్రభుత్వానికి గాంధీ బుద్ధి చెప్పాలి’

by Shyam |
‘సీఎస్ ఆదేశాలను రద్దు చేయాలి.. ప్రభుత్వానికి గాంధీ బుద్ధి చెప్పాలి’
X

దిశ, జనగామ: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 13న సమాచార హక్కు చట్టానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పేరిట జారీ చేసిన సర్క్యులర్‌లో.. పౌర సమాచార అధికారులు, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శుల అనుమతి తీసుకొని మాత్రమే సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేయడం రాజ్యాంగ వ్యతిరేకమని జనగామ జిల్లా ఆర్.టి.ఐ ఫోరమ్ కన్వీనర్ సాదిక్ అలీ అన్నారు. ఈ ఉత్తర్వులు సమాచార హక్కు చట్ట మౌలిక సూత్రాలను దెబ్బ తీసేల వున్నాయని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం జనగామలో గాంధీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించి నిరసన తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వ పాలన పారదర్శకతపై ఆ మహాత్ముడే బుద్ధి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితి జిల్లా బాధ్యులు సాంబరాజు యాదగిరి, కవి హృదయం సాహిత్యవేదిక అధ్యక్షులు పెట్లోజు సోమేశ్వరాచారి, ఎంఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు రాగల్ల ఉపేందర్, జిల్లా బాధ్యులు ఇనుముల అనిల్, సాయి, బొల్లం ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story