చేనేత వస్త్రాలపై జీఎస్టీని.. తొలగించాలి

by  |
చేనేత వస్త్రాలపై జీఎస్టీని.. తొలగించాలి
X

దిశ, మునుగోడు: చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలని గత కొన్ని రోజులుగా మండల కేంద్రంలో నిరాహార దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవరూ స్పందించకపోవడంతో గురువారం నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలో స్థానిక చౌరస్తాలో ధర్నాకు దిగారు.

నిల్వ ఉన్న చేనేత వస్త్రాలను కొనుగోలు చేయాలని, లాక్‌డౌన్ సమయంలో ఉపాధి కోల్పోయిన కార్మికులకు నెలకు రూ.15 వేలు జీవన భృతిని చెల్లించాలని, చేనేత వస్త్రాలపై జీఎస్టీని తొలగించాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా చేనేత కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని ధర్నా నిర్వహించారు. చేనేత కార్మికుల ధర్నాకు మద్దతుగా స్థానిక వ్యాపారులు తమ షాపులు స్వచ్ఛందంగా మూసివేశారు.


Next Story

Most Viewed