జలవనరుల శాఖలో నియామకాలపై ప్రతిపాదనలు

by Shyam |
జలవనరుల శాఖలో నియామకాలపై ప్రతిపాదనలు
X

దిశ, న్యూస్‌బ్యూరో: సాగు నీటిపారుదల శాఖను పునర్ వ్యవస్థీకరించి అన్ని విభాగాలనూ ఒకే గొడుకు కిందికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సిబ్బంది నియామక ప్రక్రియను కూడా చేపట్టాలని తెలంగాణ ఎన్జీవో సంఘం అభిప్రాయపడింది. ఇంజనీర్ల మొదలు క్రిందిస్థాయి సిబ్బంది వరకు ప్రాజెక్టుల గేటు దగ్గర నుంచి రైతు పొలానికి నీరు చేరే వరకు వివిధ స్థాయిల్లో ఎంత మంది సిబ్బంది అవసరమో ఆ శాఖ అధికారులు, సిబ్బందితో ఎన్జీవో సంఘం నేత కారెం రవీందర్ రెడ్డి గురువారం చర్చించారు. సిబ్బందిని నియమించడంపై త్వరలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేస్తామని తెలిపారు. జలవనరుల శాఖను ఒక ప్రత్యేక డైరెక్టరేట్‌గా పరిగణించాలని ప్రభుత్వాన్ని కోరనున్నట్లు తెలిపారు.

Advertisement
Next Story