- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్‌లో మరో విషాదం.. సినీ జర్నలిస్టు BA రాజు కన్నుమూత
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇప్పటికే కరోనా మహమ్మారి విజృంభిస్తూ అనేకమందిని పొట్టనబెట్టుకుంది. తాజాగా.. ప్రముఖ సినీ పాత్రికేయుడు, నిర్మాత, సూపర్ హిట్ ఫిలిం పత్రిక, ఇండస్ట్రీహిట్.కామ్ అధినేత బీఏ రాజు(61) కన్నుమూశారు. ఇటీవల అనారోగ్యం బారినపడిన ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్యా, ఇద్దరు కుమారులు అరుణ్ కుమార్, శివ కుమార్ ఉన్నారు. ఆయన సతీమణి ప్రముఖ రచయిత్రి, జర్నలిస్టు, కాలమిస్ట్, దర్శకురాలు కలిదిండి జయ రెండేండ్ల క్రితం మరణించారు. కాగా, బీఏ రాజు మరణం పట్ల తెలుగు చలనచిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది.
సూపర్ స్టార్ కృష్ణ వద్ద పబ్లిసిటీ వ్యవహారాలు చూసే పీఆర్‌ఓగా బీఏ రాజు తన సినీ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తరువాత సూపర్ స్టార్ కృష్ణ ప్రోద్బలంతోనే ఫిల్మ్ జర్నలిస్ట్‌గా మారారు. ఆంధ్రజ్యోతి, జ్యోతి చిత్ర, ఉదయం, శివరంజని వంటి దినవార పత్రికలలో సినీ పాత్రికేయుడుగా వివిధ హోదాలలో పని చేసిన ఆయన, 1994లో తన భార్య జయ(కలిదిండి జయ)తో కలిసి సూపర్ హిట్ పత్రికను ప్రారంభించి ఫిలిం జర్నలిజంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. కేవలం జర్నలిస్ట్‌గానే కాకుండా ఎందరెందరో అగ్రశ్రేణి సినీ నిర్మాతలకు, దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్‌కు, సాంకేతిక నిపుణులకు పీఆర్‌ఓగా పనిచేశారు. బీఏ రాజు అలాగే వెయ్యి చిత్రాలకు పైగా పబ్లిసిటీ ఇన్చార్జ్‌గా పనిచేశారు. బీఏ రాజు ఆయా సినిమాల విజయంలో కీలక పాత్ర పోషించేవారు. చిత్ర పరిశ్రమలో పెద్దా చిన్నా ప్రతి ఒక్కరితో ఆత్మీయ అనుబంధాన్ని ఏర్పరుచుకున్న రాజు నిర్మాతగా మారి తన సతీమణి జయ.బి దర్శకత్వంలో ప్రేమలో పావని కళ్యాణి, చంటిగాడు, ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.
అంతేగాకుండా.. సినిమాకు సంబంధించిన ప్రతి వేడుకలో ప్రారంభోత్సవంలో బీఏ రాజు ప్రెజెన్స్ తప్పనిసరిగా ఉండేంది. తను కనిపించలేదు అంటే సినీ ప్రముఖులందరూ రాజు ఎక్కడ.. రాజు ఎక్కడ.. అని పదే పదే అడగటం చిత్ర పరిశ్రమలో బీఏ రాజు సంపాదించుకున్న గుర్తింపునకు, గౌరవానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇలా చిత్ర పరిశ్రమలో ప్రతి ఒక్కరితో అత్యంత సన్నిహిత సంబంధాలను కొనసాగించిన బీఏ రాజు అనూహ్య మరణవార్త చిత్ర పరిశ్రమకు నిజంగా ఒక దిగ్భ్రాంతికర వార్తే అవుతుంది. కాగా, బీఏ రాజు మరణం పట్ల పలువురు సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని ప్రకటిస్తూ ఆయన ఆత్మ శాంతిని కోరుకుంటూ పంపుతున్న సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి.