- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారీగా పట్టుబడ్డ నిషేధిత గుట్కా ప్యాకెట్లు
దిశ, హుస్నాబాద్: హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత అంబర్, గుట్కా ప్యాకెట్లు పట్టుబడినట్లు ఏసీపీ వాసాల సతీష్ తెలిపారు. మంగళవారం హుస్నాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నిషేధిత గుట్కా అక్రమ రవాణా అవుతున్నట్లు నమ్మదగిన సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించామని తెలిపారు. దీంతో హుస్నాబాద్ ఎస్సై సజ్జనపు శ్రీధర్, తన సిబ్బందితో పందిళ్ల గ్రామ సమీపంలోని వాహనాలు తనిఖీ చేయగా.. సిద్దిపేట పట్టణానికి చెందిన మహమ్మద్ చాంద్ పాషా, కోహెడ మండలం పెద్ద సముద్రాలకు చెందిన మహమ్మద్ అలీ అను నిందితులను పట్టుకున్నారు. వీరు టీఎస్ 36 హెచ్ 7003 కారులో బీదర్ నుంచి నిషేధిత అంబార్, గుట్కా ప్యాకెట్లు తరలిస్తుండగా పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ. 6.62500లక్షల విలువైన గుట్కా, అంబర్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను రిమాండ్ తరలించామని ఏసీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రఘుపతి రెడ్డి, ఎస్ఐ శ్రీధర్, కానిస్టేబుల్ రవి, సంపత్ శంకర్, హోంగార్డు మల్లారెడ్డిలను అభినందించారు.