1.5 KG పుట్టగొడుగు విత్తనాలతో లక్షల్లో లాభం 

by  |
1.5 KG పుట్టగొడుగు విత్తనాలతో లక్షల్లో లాభం 
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ దెబ్బకి గత కొన్ని నెలల నుంచి పుట్టగొడుగులకు డిమాండ్ పెరిగింది. పుట్టగొడుగులు తినడంవలన శరీరానికి అవసరమైన చాలా పోషకాలు లభిస్తాయి. పలు ఔషధాల తయారీలో కూడా పుట్టగొడుగులను ఉపయోగిస్తారు. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. మినరల్స్, విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి.

విటమిన్ బి (vitamin B), విటమిన్ డి (vitamin D), పొటాషియం (potassium), కాపర్ (copper), ఐరన్ (Iron), సెలెనియం (selenium) సహా స్పెషల్ న్యూట్రియంట్ కోలిన్ (colin) కూడా పుట్టగొడుగుల్లో ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ స్పెషల్ న్యూట్రియంట్ వలన కండరాల కదలికలు, జ్ఞాపకశక్తికి మెరుగవుతాయి. ఇన్ని పోషక విలువలున్న పుట్టగొడుగులకు కరోనా కారణంగా మార్కెట్లో బాగా డిమాండ్ పెరిగింది. ధర కూడా బాగా పలుకుతుండటంతో వీటిని సాగు చేసేందుకు చాలామంది ఆసక్తి కనబరుస్తున్నారు.

పుట్టగొడుగుల ధర మార్కెట్‌లో కేజీకి రూ.300 నుంచి రూ.350 వరకు ఉంది. హోల్‌సెల్‌గా అమ్మితే ధర 40 శాతం తక్కువ పడుతుంది. పుట్టగొడుగులను పెంచితే తక్కువ ఖర్చుతోనే ఎక్కువ రాబడి పొందొచ్చు అంటున్నారు అగ్రికల్చర్ అధికారులు.

పుట్టగొడుగులను పెంచే విధానం

పుట్టగొడుగుల పెంపకం కోసం ముందుగా కంపోస్ట్‌ను తయారు చేసుకోవాలి. క్వింటాల్ కంపోస్ట్‌కు 1.5 కేజీల విత్తనాలు పెంచొచ్చు. ఇలా 4 నుంచి 5 కిలోల కంపోస్ట్ తయారు చేసుకుంటే 2 వేల కేజీల పుట్టగొడుగులను పెంచొచ్చు అంటున్నారు నిపుణులు. ఈ పుట్టగొడుగులను కేజీకి కనీసం రూ.150 చొప్పున అమ్మితే దాదాపు రూ.3 లక్షలు చేతికి వస్తాయి.

రూ.50 వేలు ఖర్చులకు పెట్టుకున్నా రూ.2.5 లక్షలు లాభం పొందొచ్చు. అదే.. భారీ స్థాయిలో పుట్టగొడుగులు పెంచాలి అనుకుంటే ముందుగా ట్రైనింగ్ తీసుకోవడం బెటర్. అగ్రకల్చర్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్లలో పుట్టగొడుగుల పెంపకానికి సంబంధించి శిక్షణ ఇస్తారు. ఒక చదరపు మీటరు విస్తీర్ణంలో 10 కేజీల పుట్టగొడుగులను పెంచొచ్చు. ఇంటి పెరట్లోనో, టెర్రస్ పైనో ఈజీగా పెంచొచ్చు.


Next Story

Most Viewed