మోడీకి 150 మంది ప్రొఫెసర్ల లేఖ..

by  |
మోడీకి 150 మంది ప్రొఫెసర్ల లేఖ..
X

దిశ, వెబ్‌డెస్క్ :

దేశంలో కరోనా వ్యాప్తి పేరుతో NEET, JEE ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాలని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లు స్పందించారు. గురువారం 150మంది ప్రొఫెసర్లు ప్రధాని మోడీకి ఘాటుగా లేఖ రాశారు.

నీట్, జేఈఈ పరీక్షలను ఎట్టిపరిస్థితుల్లోనూ వాయిదా వేయొద్దని వారు లేఖలో పేర్కొన్నారు. పరీక్షలు వాయిదా వేయడమంటే విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడమే అని వెల్లడించారు. కొందరు తమ స్వార్థ పూరిత రాజకీయాల కోసం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ప్రొఫెసర్లు లేఖ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యా సంస్థల ప్రవేశాలు, తరగతులపై విద్యార్థుల్లో భయాలున్న విషయం వాస్తవమే. అయినా, వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని.. ఈ విషయంలో ప్రభుత్వం రాజీ పడొద్దని ప్రొఫెసర్లు లేఖ ద్వారా ప్రధాని మోడీని కోరారు.


Next Story

Most Viewed