- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే జల జగడం: కోదండరామ్
దిశ ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఏడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే నది జలాల్లో మనకు దక్కాల్సిన నీటి వాటాను సాధించుకోలేకపోయామని ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. మొత్తం 812 టీఎంసీల నీటిలో మన వాటాగా చెప్పబడుతున్న 299 టీఎంసీల నీటిని వాడుకున్న దాఖలాలు లేవని తెలిపారు. కేవలం 150 నుండి 170 టీఎంసీల వరకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నదులు ఉండడం మన తూములు చిన్నవిగానూ, ఆంధ్రా ప్రాంతానికి సంబంధించిన తూములు పెద్దవిగా ఉండటంతో మన నీటివాటాను పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోయామని చెప్పారు. వారికి నేరుగా తూముల ద్వారా నీరు అందుతుంటే మనం మాత్రం ఎత్తిపోతలపై ఆధార పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. ఏడేళ్లుగా అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన నీటి వాటాను పూర్తిస్థాయిలో సద్వినియోగ పరచుకుని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నారు.
దానికి తోడు బేసిన్లు లేవు, భేషజాలు లేవు రాయలసీమ కూడా పచ్చగా ఉండాలని అని చెప్పిన పెద్దలు మన నీటి వాటాను సాధించుకునే విషయంలో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారని అన్నారు. ఇప్పుడు కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు మరింత దయనీయంగా మారుతున్నాయని కోదండరాం ఆవేదనను వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడిన నీటి విభాగాలను పరిష్కరించి తగిన న్యాయం చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని చెప్పారు. పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది నీటి వాటాను పూర్తిస్థాయిలో సాధించాలి. ప్రతి ఎకరాకు సాగు నీటిని అందించాలని నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన గెజిట్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలో ఉన్న భీమా, కృష్ణ, జూరాల నుండి ప్రతిరోజు కనీసం 5 టీఎంసీల నీటిని ఎత్తి పోసుకునే ఎందుకు లక్ష్మీదేవిపల్లి వద్ద రిజర్వాయర్‌ను నిర్మించాలని డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా గొంది మల్ల వద్ద కృష్ణా నది మీద బ్యారేజ్. అమ్రాబాద్. బల్మూర్ ఎత్తిపోతల పథకాలను చేపట్టాలని కోరారు. ఉమ్మడి జిల్లాకు దక్కాల్సిన నీటి సాధన కోసం రాజీలేని పోరాటాలు, సభలు సమావేశాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆయా సంఘాల నేతలు ఓబేదుల్లా కొత్వాల్, ఖలీల్, హనీఫ్ అహ్మద్, వెంకట్ రెడ్డి, చంద్రశేఖర్, కిష్టన్న, బషీర్, ప్రభాకర్, బైరెడ్డి సతీష్, నల్గొండ శ్రీధర్, టీజేఎస్ ప్రకాష్ గౌడ్, నాగర్ దొడ్డి వెంకట్ రాములు, మధుసూదన్, రామ్ చందర్, చిన్నంబావి శ్రీను, ఖాదర్ భాషా, ఇక్బాల్ పాష, కోటరవీందర్ నాథ్, శ్రీశైలం, శ్రీదేవి, పాలమూరు అధ్యయన వేదిక సభ్యులు తిమ్మప్ప, కేసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.