కౌంటింగ్ కేంద్రం నుంచి దీనంగా వెళ్తున్న కోదండరామ్

by Shyam |
Professor Kodandaram
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల ఓట్ల లెక్కింపు శనివారం నాలుగో రోజు కొనసాగుతోంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ స్థానం ఓట్ల లెక్కింపు హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతుండగా, వరంగల్‌-ఖమ్మం-నల్లగొండ స్థానం ఓట్ల లెక్కింపును నల్లగొండలోని ఆర్జాలబావిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోదాములో నిర్వహిస్తున్నారు. అయితే మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ గెలుపునకు కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Professor Kodandaram

అయితే రెండో ప్రాధాన్యతలో కూడా ఎవ్వరికీ స్పష్టతమైన మెజార్టీ వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఒక వేళ ఎవరికీ మ్యాజిక్‌ ఫిగర్‌ రాకపోతే ఎక్కువ ఓట్ల వచ్చిన అభ్యర్థినే విజేతగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నల్లగొండ-వరంగల్- ఖమ్మం స్థానం నుంచి టీజేఎస్ తరపున బరిలో ఉన్న ప్రొఫెసర్ కోదండరామ్ ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. రెండో ప్రాధాన్యతలో ఎక్కువ ఓట్లు సాధించినా గానీ మల్లన్నను అధిగమించలేకపోయారు. దీంతో గెలుపుపై ఆశలు వదులుకున్న కోదండరామ్ కౌంటింగ్ కేంద్రం నుంచి దీనంగా నడుచుకుంటూ.. వెళ్తున్న వీడియో పలువురిని ఆలోచింపజేస్తోంది. ప్రస్తుతం పోటీలో పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లన్న ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed