రైతుల కోసం పోరాటం కొనసాగిస్తాం: ప్రొఫెసర్ కోదండరాం

by Shyam |   ( Updated:2021-11-26 06:37:56.0  )
రైతుల కోసం పోరాటం కొనసాగిస్తాం: ప్రొఫెసర్ కోదండరాం
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: రైతుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ‘రైతు రక్షణ యాత్ర’ చేపట్టినట్లు తెలంగాణ జన సమితి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. రైతు రక్షణ యాత్రలో భాగంగా కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలంలోని ఆత్మకూరు గ్రామంలో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘రైతు రక్షణ యాత్ర’ ఉద్దేశం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల సమస్యలను తెలుసుకోవడమే అన్నారు. ఢిల్లీకి పోయివచ్చిన కేసీఆర్ ఏమి చేశారని ప్రశ్నించారు. రైతులకు ఏమి సమాధానం చెప్తారో తెలపాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నెలకొన్న గందరగోళ పరిస్థితిని రూపుమాపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

రైతుల ప్రయోజనాలు, పరిరక్షణ కోసం ఈ యాత్ర మొదలుపెట్టాము, ఇది ఇక్కడితో మొదలయ్యేదికాదు, ఆగేది కాదని అన్నారు. రైతుల ప్రయోజనాలు కాపాడేదాకా మేము ఈ పోరాటం కొనసాగిస్తామని ఆయన ప్రకటించారు. కామారెడ్డి జిల్లాలోనే ఐదుగురు రైతులు చనిపోయారని, చనిపోయిన ప్రతి రైతుకు 50 లక్షలు ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా ఇన్చార్జి నిర్జన రమేష్, జిల్లా జనరల్ సెక్రెటరీ లక్ష్మణ్, టీజేఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు వినోద్ కుమార్, నాయకులు తుల్జా రెడ్డి, కొండల్రెడ్డి, భుజంగరెడ్డి, అనిల్, మండల నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed