- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
సినిమా థియేటర్లను తెరవండి : నట్టికుమార్
by Shyam |

X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో సినిమా థియేటర్లను త్వరగా తెరవాలని ప్రముఖ నిర్మాత నట్టికుమార్ ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్ల మూసివేయడం వలన చాలా మంది కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వీరి సంఖ్య ప్రత్యక్షంగా, పరోక్షంగా 50వేలు ఉంటుందని.. పని లేకపోవడంతో వీరంతా రోడ్డు పడ్డారని తెలిపారు. ప్రభుత్వం వీలైనంత త్వరగా థియేటర్లు ఓపెన్ చేయించి వారిని ఆదుకోవాలని నట్టికుమార్ విజ్ఞప్తి చేశారు.
కాగా, కరోనా నేపథ్యంలో గత మార్చి చివరలో మూతపడిన థియేటర్లు ఇంతవరకు తెరచుకోలేదు. ఇటీవల అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్రం అనుమతులు ఇచ్చినా.. 50శాతం ఆక్యూపెన్సీతో థియేటర్లు నడపటం సాధ్యం కాదని యాజమాన్యాలు నిర్ణయించాయి. దీంతో నేటికి సినిమా హాళ్లు తెరచుకోలేదు.
Next Story