మైండ్‌బ్లాక్ చేస్తోన్న దళపతి విజయ్ రెమ్యునరేషన్!

by Shyam |   ( Updated:2021-05-10 21:07:06.0  )
Thalapathy Vijay
X

దిశ, వెబ్‌డెస్క్: తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేవలం తమిళంలోనే కాకుండా సౌత్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్టర్, బిగిల్, అదిరింది సినిమాలతో తెలుగులోనూ దళపతి మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. కాగా, ప్రస్తుతం విజయ్ డెరైక్ట్ తెలుగు చిత్రంలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒక‌రైన దిల్‌రాజు, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేష‌న్‌లో ఈ సినిమా రూపొందుతుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో విజయ్ రెమ్యునరేషన్‌కు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త కూడా ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది.

Dil Raju, Thalapathy Vijay, vamsi paidipally

ఈ సినిమాను దిల్ రాజు పాన్ ఇండియాగా నిర్మించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాకు దిల్‌రాజు భారీ దాదాపు రూ.170 కోట్ల బ‌డ్జెట్ పెడుతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో దళపతికి రూ.90 కోట్ల భారీ రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేశార‌ని తెలుస్తోంది. కాగా, ఇప్పటివరకూ విజయ్ త‌న సినిమాల‌కు రూ.80 కోట్ల వరకూ తీసుకోగా, దిల్‌రాజు దానికి మించిన రెమ్యున‌రేష‌న్ ఆఫ‌ర్ చేసి విజయ్‌ను లాక్‌ చేసుకున్నట్టు సమాచారం. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story