- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భర్తతో దాంపత్య జీవితంపై నిట్టూర్చిన ప్రియాంక చోప్రా
దిశ, సినిమా : ఇంటర్నేషనల్ పాపులర్ టాక్ షో ‘సూపర్ సోల్’లో ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కిల్‌ను ఇంటర్వ్యూ చేసిన ఓఫ్రా విన్‌ఫ్రే ప్రపంచాన్ని షేక్ చేశారు. ఇప్పుడు అదే జోష్ కంటిన్యూ చేస్తూ తన నెక్స్ట్ ఎపిసోడ్‌ను గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రాతో డిజైన్ చేశారు. మార్చి 20న డిస్కవరీ ప్లస్‌లో ప్రసారం కానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేసిన ఓఫ్రా.. ఈ క్లిప్‌లో ప్రియాంక తన పుస్తకం (మెమొయిర్) ‘అన్‌ఫినిష్‌డ్’ను రిలీజ్ చేసేందుకు ఇదే సరైన సమయమని ఎందుకు భావించారని ప్రశ్నించింది.
దీనికి సమాధానమిచ్చిన ప్రియాంక.. ఫైనల్‌గా లాక్‌డౌన్ తన పుస్తకంపై దృష్టిపెట్టేందుకు సమయం ఇచ్చిందని తెలిపింది. ప్రొఫెషనల్‌గా, పర్సనల్‌గా తనపై కొంచెం ఎక్కువ కాన్ఫిడెన్స్ వచ్చిందని, అందుకే ప్రపంచం ముందుకు తన పుస్తకం తీసుకొచ్చానని వివరించింది. 20 ఏళ్ల వయసులో ఉన్న అభద్రతా భావాలను వదిలిపెట్టాలని, గతంలో తనను భయపెట్టే విషయాల గురించి బాధపడకూడదని నిర్ణయించుకున్నానన్న పీసీ.. ఈ పుస్తకం తన లైఫ్‌ను అడ్రస్ చేసేందుకు సాయపడిందని తెలిపింది. మరో క్లిపింగ్‌లో భర్త నిక్ జోనస్‌తో కలిసి దాంపత్య జీవితం గురించి ప్రశ్నించగా.. పీసీ నిట్టూర్పుతో సమాధానమిచ్చినట్లు చూపించారు.