ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న జిమ్నాస్ట్.. ప్రశంసించిన ప్రియాంక

by Shyam |   ( Updated:2021-07-29 04:37:53.0  )
ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న జిమ్నాస్ట్.. ప్రశంసించిన ప్రియాంక
X

దిశ, సినిమా : జిమ్నాస్టిక్స్‌ చరిత్రలో అత్యుత్తమ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న అమెరికా యువ తార సిమోన్‌ బైల్స్‌.. టోక్యో ఒలింపిక్స్ 2020 నుంచి తప్పుకుంది. మానసికంగా సిద్ధంగా లేకపోవడంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఆమె నిర్ణయం క్రీడాప్రపంచానికి షాక్ ఇవ్వగా.. మానసిక ఆరోగ్య అంశం గ్లోబల్ వైడ్‌గా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలో పలువురు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు సిమోన్ నిర్ణయాన్ని స్వాగతించగా.. ప్రియాంక చోప్రా కూడా తనకు మద్దతుగా పలు విషయాలు పంచుకుంది.

గతంలో తన యూట్యూబ్ సిరీస్ కోసం సిమోన్‌తో చేసిన ఇంటర్వ్యూ వీడియోను షేర్ చేసిన పీసీ.. ‘రోల్ మోడల్, చాంపియన్@ సిమోన్‌ బైల్స్ గురించి కొన్నేళ్ల కిందట తెలుసుకోవడం ఆనందాన్నిచ్చింది. ఆమె తన బలహీనతపై స్వీయ అవగాహనతో నన్ను ఇంప్రెస్ చేసింది’ అని తెలిపింది. ఈ మేరకు సిమోల్‌ను GOAT-(గేట్‌నెస్ ఆఫ్ ఆల్ టైమ్)గా వర్ణించిన ప్రియాంక.. మనుషులకు ఇది సాధారణ విషయమేనని క్లారిటీ ఇచ్చినందుకు థాంక్స్ చెప్పింది. నార్మల్‌గా ఉన్నప్పుడు మాత్రమే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలమని, ధైర్యంగా ఇలాంటి నిర్ణయం తీసుకొని రియల్ చాంపియన్‌‌గా నిరూపించుకున్నావు అని ప్రశంసించింది.

Advertisement

Next Story