ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎందుకో తెలుసా.?

by Shyam |   ( Updated:2021-08-26 04:48:48.0  )
ఆస్తులు అమ్ముకుంటున్న ప్రియాంక చోప్రా.. ఎందుకో తెలుసా.?
X

దిశ, సినిమా : గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా తన ఆస్తులను అమ్మేస్తోంది. ముంబై, లాస్‌ ఏంజిల్స్‌, గోవాలో విలువైన ప్రాపర్టీస్‌తో పాటు మొత్తంగా కోట్లల్లో ఆస్తులుండగా.. తాజాగా రెండు అపార్ట్‌మెంట్లను అమ్మేసిందని తెలుస్తోంది. అంతే కాదు, ముంబైలోని తన ఆఫీసు భవంతిని కూడా అద్దెకిస్తోందని సమాచారం.

మహారాష్ట్రలోని అంధేరీలో ఓ బిల్డింగ్‌లో ఒక ఫ్లాట్‌ను రూ. 3 కోట్లకు అమ్మేసిన పీసీ.. అదే బంగ్లాలో విశాలమైన ఫ్లాట్‌ను రూ.4 కోట్లకు విక్రయించింది. అయితే 2040 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ భవనంలో అద్దెకు దిగాలంటే నెలకు రూ.2.11 లక్షలు చెల్లించాల్సిందే. అయితే గతంలో ముంబైలోని జుహు అపార్ట్‌మెంట్‌లో ఉన్న బ్యూటీ.. 2018లో నిక్‌ జోనస్‌తో పెళ్లి తర్వాత కొంతకాలం పాటు అక్కడే నివసించింది.

తర్వాత లాస్‌ ఏంజిల్స్‌లో ఓ ఖరీదైన ఇల్లును సొంతం చేసుకుని దంపతులిద్దరూ అక్కడికి షిఫ్ట్‌ అయ్యారు. ఆ ఇంటి ఖరీదు సుమారు రూ.150 కోట్లు ఉంటుందని సమాచారం. ముంబైలో ప్రియాంక నివసించిన ఇంటిని బాలీవుడ్‌ బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ ఏడు కోట్లు పెట్టి సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story