‘నా ఇష్టం తెలుసుకుని.. మా ఆయన నేర్పిస్తున్నాడు’

by Shamantha N |   ( Updated:2020-05-12 22:22:48.0  )
‘నా ఇష్టం తెలుసుకుని.. మా ఆయన నేర్పిస్తున్నాడు’
X

కరోనా వ్యాప్తి మూలంగా లాక్‌డౌన్ విధించడంతో హీరోలు, హీరోయిన్లు, క్రీడాకారులు అందరూ ఇండ్లకే పరిమితం అయ్యారు. అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులను పలకరిస్తున్నారు. సరదాగా ఇంట్లో పనులు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారు. మరి కొందరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కూడా లాక్‌డౌన్‌లో సమయం వృథా చేయకుండా తన భర్త నిక్ జోనాస్ వద్ద పియానో నేర్చుకుంటుందట. ‘‘నాకు పియానో అంటే చాలా ఇష్టం. ఇంతవరకూ ప్లే చేసే అవకాశం రాలేదు. నా ఇష్టాన్ని తెలుసుకొని మా ఆయన రోజూ ఓ గంట సేపు నాకు పియానో నేర్పిస్తున్నారు. అలాగే డాన్స్‌ మిస్‌ అవుతున్నాననిపించి, హిపాప్‌ డాన్స్‌ కూడా నేర్చుకుంటున్నాను’ అని ప్రియాంక తెలిపారు. ప్రస్తుతం ఈ దంపతులు లాస్‌ ఎంజెల్స్‌లో ఉంటున్నారు. నిక్‌ డయాబెటిక్‌ కావడంతో వెంటనే సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లామనీ, అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఇంట్లోనే ఉంటున్నామని ప్రియాంక ఆమె తెలిపారు. ఇద్దరూ కలసి ఒకే చోట ఉంటున్నందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. రెండు నెలల ఇంటి పనుల నిమిత్తం అడుగు బయట అడుగుపెట్టానంటూ ప్రియాంక సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు.

Advertisement

Next Story