ప్రియాంక సోషల్ మీడియాకు అంత డిమాండా?

by Shyam |
ప్రియాంక సోషల్ మీడియాకు అంత డిమాండా?
X

దిశ, వెబ్‌డెస్క్: యూనివర్సల్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఏం చేసినా విశేషమే. భర్త నిక్ జోనస్‌తో కలిసి లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్న ప్రియాంక .. ప్రతీ పండుగ, కార్యక్రమాల్లో పాల్గొని ఆడిపాడడమే కాదు ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. పైగా ఇద్దరి జోడికి ఫుల్ క్రేజ్ ఉండడంతో ఫాలోవర్లు కూడా ఎక్కువే. దీంతో షేర్ చేసిన ప్రతీ విషయం నెట్టింట్లో వైరలవుతుంది. ఇన్‌స్టాగ్రాంలో ఆమెకు ఏకంగా 50 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో కంపెనీలు ఓ ఆలోచనకు వచ్చాయి. ఎలక్ట్రిక్ మీడియా, టీవీల్లో యాడ్ ప్రసారం చేయడం కంటే… ప్రియాంక చోప్రా సోషల్ మీడియా ఎకౌంట్ బెటర్ అని నిర్ణయించుకున్నాయి. అందుకే తమ బ్రాండ్‌లను ప్రమోట్ చేసుకునేందుకు ప్రియాంక చోప్రాని ఎన్నుకున్నాయి. ఈ క్రమంలో ఒక బ్రాండ్‌ను ప్రమోట్ చేసేందుకు ప్రియాంక ఏకంగా రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుందని సమాచారం. ఈ విధంగా సోషల్ మీడియా ఫాలోవర్స్, ఫ్యాన్స్ వల్ల ప్రియాంక భారీ మొత్తంలో డిమాండ్ చేస్తూ క్యాష్ చేసుకుంటుందట. హోపర్ హెచ్ క్యూ సంస్థ ప్రకటించిన ఇన్‌స్టాగ్రామ్ సంపన్నుల జాబితాలో 19వ స్థానంలో ప్రియాంక చోప్రా ఉండగా.. 23వ స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నారు.

Tags :Priyanka Chopra, Nick Jonas, Social Media, Promotion

Advertisement

Next Story

Most Viewed