ప్రియాంక@ 20 ఇన్ 2020

by  |
ప్రియాంక@ 20 ఇన్ 2020
X

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఎంటర్‌టైన్మెంట్ ఇండస్ట్రీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసింది. 2000 సంవత్సరంలో ‘మిస్ ఇండియా’ టైటిల్ గెలిచి.. తన లైఫ్‌లో మొదటి మైల్‌స్టోన్ రీచ్ అయిన బ్యూటీ.. ఆ తర్వాతి ఏడాదే ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలుచుకుంది. అప్పుడు తన వయసు 18 ఏళ్లు కాగా.. ఆ వీడియోలు చూస్తూ తను ఎలా ఉంది? ఏం ధరించింది? అసలు తలపై కిరీటం ఎందుకుంది? అంటూ తనను తానే కామెంట్ చేసుకుంటూ 20 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను షేర్ చేసుకుంది. తన లాంగ్ హెయిర్ గురించి ప్రత్యేకంగా మాట్లాడిన ప్రియాంక.. అంత జుట్టు ఎలా పోయిందబ్బా? అంటూ ప్రశ్నించుకుంది.

మిస్ ఇండియా పోటీల్లో తనను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన తీరును చూస్తూ తనకు తానే శభాష్ చెప్పుకుంది ప్రియాంక. మిస్ ఇండియా, మిస్ వరల్డ్ టైటిల్ గెలవడమనేది క్రేజీ మూమెంట్ అన్న బ్యూటీ.. అసలు ఇలా జరుగుతుందని ఎప్పుడూ ఎక్స్‌పెక్ట్ చేయలేదంది. ఆ తర్వాత ట్రైన్ టికెట్ బుక్ చేశారని, తిరిగెళ్లి బోర్డ్ ఎగ్జామ్స్ రాశానని చెప్పుకొచ్చింది. ఈ మూమెంట్‌కు 20 ఏళ్లు పూర్తి కాగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనక్కి తిరిగి చూసుకోలేదని తెలిపింది ప్రియాంక.

https://www.instagram.com/tv/CC_7-kvDYfc/?igshid=fmem9hxuasvm

తన ఫొటో‌షూట్ వీడియోస్ చూసుకున్న ప్రియాంక.. వీటిని చూడటం చాలా కష్టంగా ఉందని తెలిపింది. చాలా చిన్న వయసులోనే ఫ్యాషన్ పట్ల చాలా ఆసక్తితో ఉన్నట్లు చెప్పింది.


Next Story