- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాత్యహంకారానికి వ్యతిరేకంగా ప్రియాంక నిక్
మోస్ట్ ఫాలోయింగ్ కపుల్ ప్రియాంక చోప్రా- నిక్ జోనస్ జాత్యహంకారానికి వ్యతిరేకంగా పోరాడేందుకు తమ మద్దతు ప్రకటించారు. ఈ మేరకు అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మద్దతు ప్రకటిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. జార్జి ఫ్లాయిడ్ హత్య ప్రియాంకను, తనను ఉద్వేగానికి గురిచేసిందన్న నిక్ అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసమానతల వాస్తవికత అర్థం అవుతుందన్నారు. జాతి అహంకారం, మతోన్మాదం చాలాకాలం నుంచే ఉన్నా దీనిపై చర్యలు తీసుకోలేకపోతున్నారని అభిప్రాయపడ్డాడు. కానీ, ఇప్పుడు కూడా నిశ్శబ్దంగా ఉంటే జాతి అహంకారాన్ని బలోపేతం చేయడమే అవుతుందని, దాన్ని కొనసాగించడానికి అనుమతించినట్లు అవుతుందన్నాడు నిక్. ‘నేను జాతి అహంకారిని కాదు అని చెప్పడం కాదు.. జాత్యాహంకారానికి వ్యతిరేకంగా పోరాడుతున్న నల్లజాతి సమాజానికి సపోర్ట్‌గా నిలబడటానికి ముందుకు రావాలి’ పిలుపునిచ్చాడు. ఈ పోరాటానికి మద్దతుగా తమవంతు విరాళం ఇచ్చినట్లు వెల్లడించాడు.
Pri & I have heavy hearts … The reality of the inequalities in this country, and around the world, are glaring. Systemic racism, bigotry and exclusion has gone on for far too long, and remaining silent not only reinforces it, but it allows it to continue.
— Nick Jonas (@nickjonas) June 3, 2020