ప్రియాంకకు మళ్లీ చాన్స్ ఇచ్చిన విక్రమ్?

by Shyam |
ప్రియాంకకు మళ్లీ చాన్స్ ఇచ్చిన విక్రమ్?
X

దిశ, వెబ్‌డెస్క్: విక్రమ్ కె కుమార్, అక్కినేని నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘థాంక్యూ’. చైతుకు ఇది 20వ సినిమా కాగా.. ‘మనం’ తర్వాత విక్రమ్, చైతు కాంబినేషన్ ఈ సినిమాతో రిపీట్ కాబోతుంది. కాగా శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లకు అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా ‘గ్యాంగ్ లీడర్’ సినిమా ద్వారా ప్రియాంక మోహన్‌ను తెలుగు తెరకు పరిచయం చేసిన విక్రమ్.. తనకు మరోసారి చాన్స్ ఇచ్చారని సమాచారం. ప్రియాంక.. ఇప్పటికే శర్వానంద్‌తో ‘శ్రీకారమ్’ సినిమా చేస్తుండగా.. మరిన్ని టాలీవుడ్ మూవీస్‌కు సైన్ చేయనుందట భామ. ఇక ‘థాంక్యూ’ చిత్రానికి లెజెండరీ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ కాగా.. అబ్బూరి రవి రచయిత. ఎస్.ఎస్. థమన్ స్వరాలు సమకూరుస్తున్నారు.

Advertisement

Next Story