- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కారణమేమీ లేదు : ప్రియావారియర్
ఓ పాటలో చిన్న ‘కన్నుగీటే’ సీన్‌తోనే ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్‌కు సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు పది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, ఈ భామ లాక్‌డౌన్ టైమ్‌లో హఠాత్తుగా ఇన్‌స్టా నుంచి వైదొలగింది. దీంతో అభిమానులు అసలు ఏమై ఉంటుందనే ఆలోచనలో పడ్డారు. మళ్లీ ఇన్‌స్టా ఫ్యామిలీకి తిరిగిరావాలని బలంగా కోరుకున్నారు. దీంతో దాదాపు రెండు వారాల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది ప్రియ.
ఇన్‌స్టా నుంచి బ్రేక్ తీసుకునేందుకు ప్రత్యేకంగా కారణమేమీ లేదని… కేవలం ప్రశాంతత కోసమే ఇలా చేశానని చెప్పింది. కానీ, దీనిపైనా కొందరు చేసిన ట్రోల్స్ బాధకు గురిచేశాయని తెలిపింది. పబ్లిసిటీ కోసమే ఇన్‌స్టా నుంచి వైదొలిగానని చేసిన కామెంట్ సరైంది కాదన్న ప్రియా వారియర్.. కరోనా వైరస్ కారణంగా కష్టాలు అనుభవిస్తున్న సమయంలో అలా ఎవరైనా చేస్తారా? అని ప్రశ్నించింది. కొవిడ్-19 కారణంగా ఏర్పడిన ఈ అసాధారణ పరిస్థితులు త్వరగా సాధారణ స్థితికి చేరుకోవాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపింది.