- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టాలీవుడ్.. మై సెకండ్ హోమ్ : ప్రియా ప్రకాశ్
దిశ, సినిమా : మలయాళ భామ ప్రియా ప్రకాశ్ వారియర్.. ‘ఒరు అదార్ లవ్’ మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమాలోని ఒక్క కన్నుగీటు సీన్‌తో ‘వింక్‌గాళ్’గా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. ఇక తెలుగులో నితిన్ ‘చెక్’ సినిమాలో కనిపించిన బ్యూటీ.. ప్రస్తుతం తేజ సజ్జాతో కలిసి ‘ఇష్క్’ చిత్రంలో నటిస్తోంది. ఎస్.ఎస్ రాజు దర్శకత్వం వహిస్తున్న సినిమాను ఆర్‌బీ చౌదరి సమర్పణలో ఎన్వీ ప్రసాద్, పారస్ జైన్, వాకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా జులై 30న విడుదలవుతుండగా ప్రియా ప్రకాశ్ మీడియాతో ముచ్చటించింది. మలయాళ ‘ఇష్క్’ చిత్రంలోని కథ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ నచ్చడంతో తెలుగు రీమేక్‌లో నటించేందుకు అంగీకరించినట్లు వెల్లడించింది. ‘ఇష్క్’ టీమ్‌తో జర్నీని బాగా ఎంజాయ్ చేశానన్న ప్రియ.. కోస్టార్ తేజ చాలా యాక్టివ్‌గా ఉంటాడని, తెలుగు డైలాగ్స్ విషయంలో హెల్ప్ చేశాడని తెలిపింది. సూపర్‌గుడ్ ఫిలింస్ వంటి పెద్ద బ్యానర్‌లో అవకాశమిచ్చిన నిర్మాతలకు థ్యాంక్స్ చెప్పింది.
ఒరిజినల్ ‘ఇష్క్’ మూవీలోని సోల్ మాత్రమే తీసుకొని, తెలుగు ఆడియన్స్ టేస్ట్‌కు తగ్గట్లు మార్పులు చేశారని వెల్లడించింది. సినిమా ఎంపికలో కథకే ప్రాధాన్యత ఇస్తానన్న చెక్ బ్యూటీ.. ఫ్యూచర్‌లో తెలుగులో ఫ్లూయెంట్‌గా మాట్లాడతాననే నమ్మకముందని స్పష్టం చేసింది. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకుంటున్నానని, నిజానికి టాలీవుడ్ తనకు సెకండ్ హోమ్ వంటిదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తెలుగులో ఒక ప్రాజెక్ట్‌తో పాటు హిందీలో రెండు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్ రావాల్సి ఉందని పేర్కొంది.