ప్రైవేటు టీచర్స్ ఫోరం నిరసన..!

దిశ, సిద్దిపేట: ఉపాధ్యాయ దినోత్సవాన్ని బ్లాక్ డేగా ప్రకటిస్తూ.. శనివారం తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ టీచర్ల సమస్యలను వివరిస్తూ సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారికి వినతిపత్రం అందజేశారు. ప్రతి ఏడాది సెప్టెంబర్ 5ను గురుపూజ దినోత్సవంగా జరుపుకుంటున్నామని.. కానీ, ఈ ఏడాది కరోనా విజృంభిస్తుండడంతో ప్రైవేటు టీచర్ల బతుకుల్లో చీకట్లు నింపిందని జిల్లా అధ్యక్షులు బాలరాజు అన్నారు. టీచర్లను ఆదుకోవాల్సిన యాజమాన్యాలు చేతులెత్తేశాయని.. ఓట్లు వేయించుకున్న నేతలు మొహం చాటేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement