కరోనా శాంపిళ్ల సేకరణ నిలిపివేత

by Shyam |   ( Updated:2020-07-02 01:50:53.0  )
కరోనా శాంపిళ్ల సేకరణ నిలిపివేత
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని పలు ప్రైవేట్ ల్యాబ్ లు ఇవాళ్టి నుంచి ఈనెల 5 వరకు నాలుగు రోజులపాటు కరోనా శాంపిల్స్ ను తీసుకోవడం నిలిపివేశాయి. ఇప్పటికే చాలా ల్యాబ్ లు సేకరించిన శాంపిళ్లను పరీక్షించడం శక్తికి మించిన పనిగా భావించడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ, ప్రభుత్వ ల్యాబ్ లు మాత్రం యథావిథిగా శాంపిళ్లను స్వీకరిస్తున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 18 ప్రైవేట్ ల్యాబ్ లకు ఐసీఎంఆర్ కరోనా పరీక్షలు చేసేందుకు అనుమతిచ్చింది. ఈ నేపథ్యంలో గత 15 రోజుల నుంచి ఆ ల్యాబ్ లలో కరోనా పరీక్షలు చేస్తున్నారు. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ ల్యాబ్ ల కరోనా పరీక్షల పనితీరును పరిశీలించి లోపాలున్నాయని గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆ లోపాలను సవరించుకోవాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కొన్ని ల్యాబ్ లు ఆ లోపాలను సరిదిద్దుకున్నాయి. ఇందులో భాగంగా కరోనా శాంపిల్స్ సేకరించే సిబ్బందికి ప్రత్యేక శిక్షణా ఇవ్వడంతోపాటు డిజ్ ఇన్ ఫెక్షన్ కోసం నాలుగు రోజులపాటు స్వచ్ఛందంగా కరోనా శాంపిల్స్ తీసుకోవడం నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ల్యాబ్ లు ప్రకటించాయి. ఆసుపత్రుల సిబ్బంది శాంపిల్స్ సేకరించి పంపిస్తే పరీక్షలు నిర్వహిస్తామని తెలిపాయి. నేరుగా ల్యాబ్ కు వచ్చి పరీక్షలు చేయించుకునే అనుమానితుల శాంపిల్స్ మాత్రం సేకరించబోమని పేర్కొన్నాయి.

Advertisement

Next Story