- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘ప్రైవేటు మైనింగ్‌తో సింగరేణికి ముప్పు’
దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో బొగ్గు గనుల మైనింగ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు అనుమతించడంతో ఆ ప్రభావం సింగరేణిపై పడనుంది. తక్షణం వచ్చే ముప్పేమీ లేకపోయినా భవిష్యత్తులో ఆ ప్రమాదం ఉందని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంస్థ ఉత్పత్తి, మార్కెటింగ్ వ్యవహారాలపై ఆ ప్రభావం పడి చివరకు కార్మికుల వేతనాలు, సంస్థ ఆర్థిక వ్యవస్థపై చూపుతుందని వారి అనుమానం. క్రమంగా కోల్ ఇండియా, సింగరేణి లాంటి ప్రభుత్వ రంగ బొగ్గు మైనింగ్ సంస్థలు భవిష్యత్తులో ఉనికి కోల్పోతాయన్న సందేహాలనూ అధికారులు వ్యక్తం చేశారు. సింగరేణి గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్‌కు ఇది అస్త్రంగా మారనుంది. టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) జూలై 2వ తేదీ సమ్మెలో పాల్గొంటోంది.
మొత్తం 17 ఓపెన్‌కాస్ట్ గనులు, 27 అండర్ గ్రౌండ్ గనుల నుంచి సింగరేణి సంస్థ బొగ్గును వెలికితీస్తోంది. ప్రతీ ఏటా 60 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతోంది. సంస్థలో 47 వేల మంది కార్మికుల భవిష్యత్తుపై కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం ప్రభావం చూపనుంది. ప్రతి సంవత్సరం సింగరేణి ద్వారా జరిగే బొగ్గు అమ్మకాల విలువ సుమారు రూ. 25 వేల కోట్లు. 90 శాతం మేర థర్మల్ విద్యుత్ కేంద్రాలకు 10 శాతం సిమెంట్ కంపెనీలకు విక్రయిస్తుంటుంది.
దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్న రీత్యా భవిష్యత్తు బొగ్గు అవసరాలను కేవలం కోల్ ఇండియా, సింగరేణిలు తీర్చలేవన్న అభిప్రాయంతో కమర్షియల్ మైనింగ్ కు అనుమతులిచ్చిందనే వాదన వినిపిస్తోంది. దేశంలో ఉన్న బొగ్గు నిల్వలను వెలికితీసి ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించాలంటే ప్రభుత్వ పెట్టుబడులు సరిపోవని ప్రైవేటు భాగస్వామ్యం ఉండాల్సిందేనన్న ఉద్దేశంతో బొగ్గు మైనింగ్ ప్రైవేటీకరణను తీసుకొచ్చినట్లు సీనియర్ మంత్రులు గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఇకపైన బొగ్గు గనుల కేటాయింపులో సింగరేణికి ప్రైవేటు సంస్థలు పోటీగా మారుతాయేమోనని, అది సంస్థ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని కార్మిక సంఘాలు ఆందోళన చెందుతున్నాయి.