నేను డోప్ టెస్టులో పట్టుబడటానికి అదే కారణం : పృథ్వీషా

by Shyam |
Prithvi shah
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీషా 2019లో డోపింగ్ టెస్టులో పట్టుబడి 8 నెలల నిషేధానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఆ విషయంపై ఇప్పటి వరకు నోరు మెదపని పృథ్వీషా అసలు ఆ టెస్టులో ఎలా పట్టు బడ్డాడో తెలిపాడు. ‘ఇండోర్‌లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడుతుండగా జలుబు,. దగ్గుతో ఇబ్బంది పడ్డాను. రాత్రి భోజనం చేసిన తర్వాత విపరీతమైన దగ్గు వచ్చింది. దీంతో మా నాన్న బయట మార్కెట్‌లో దొరికే కాఫ్ సిరప్ కొనుక్కొని తీసుకోమన్నాడు. ఆ రోజు రాత్రి దగ్గు రాకుండా ఆ సిరప్ యూజ్ చేశాను.

అయితే ఆ సమయంలో మా ఫిజియోను సంప్రదించకుండానే ఆ డ్రగ్ తీసుకున్నాను. అది జరిగిన రెండు రోజులకే నా శాంపిల్స్ డోప్ టెస్టుకోసం పంపారు. దీంతో నిషేధిత డ్రగ్స్ తీసుకున్నట్లు ఫలితాల్లో వచ్చింది. నేను పాజిటివ్‌గా దొరికిపోయాను. అప్పుడు చాలా బాధపడ్డాను. అందరూ దోషిలాగ చూస్తుంటే సిగ్గు వేసింది. అది మాటల్లో చెప్పలేను’ అని పృథ్వీషా ఆవేదన చెందాడు. ఆ సమయంలో క్రికెట్ అభిమానులు, ఇతరులు ఏమనుకుంటారో అని చాలా ఆందోళన చెందినట్లు షా చెప్పాడు. నేను కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలోనే అలా నిషేధానికి గురికావడంతో ఏం చేయాలో పాలుపోలేదని అన్నాడు. పృథ్వీషాకు 8 నెలల నిషేధం విధించినా.. పలు కారణాల వల్ల దాన్ని రెండున్నర నెలలకు బీసీసీఐ పరిమితం చేసింది.

Advertisement

Next Story