27 మంది జీవిత ఖైదీలకు కరోనా

by srinivas |   ( Updated:2020-07-30 05:57:31.0  )
27 మంది జీవిత ఖైదీలకు కరోనా
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖలో కరోనా కలకలం సృష్టిస్తోంది. స్థానిక సెంట్రల్ జైల్లో 10 సిబ్బంది, 27 మంది జీవిత ఖైదీలకు కరోనా సోకింది. మొద్దు శ్రీనును హత్య చేసిన ఓం ప్రకాశ్ ఇటీవల జైల్లో మృతి చెందాడు. అతని మృతదేహానికి పరీక్షలు చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఖైదీలకు వైరస్ బారిన పడటంతో క్వారంటైన్ సెంటర్ లకు తరలించారు. మిగతా ఖైదీలకు కూడా కోవిడ్ టెస్టులు చేయనున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed