నిజమైన శ్రీమంతుడు మహేశ్ బాబు.. ఏపీకి ఫండ్ ప్రకటన

by Anukaran |
Mahesh babu
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి ప్రకృతి విపత్తులు సంభవించినా మేమున్నాం అంటూ తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు విరాళాలు అందజేస్తూ ఉంటారు. కరోనా సమయంలోనూ సీఎం రిలీఫ్ ఫండ్ కు పలువురు విరాళాలు ప్రకటించడం చూశాం. అయితే, తాజాగా ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాల కారణంగా భారీ నష్టం జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో వరద బాధితులకు అండగా సినీ హీరోలు ఒక్కొక్కరుగా సహాయాలను ప్రకటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం జూనియర్ ఎన్టీఆర్ రూ.25 లక్షలు ప్రకటించగా.. ప్రిన్స్ మహేష్ బాబు తన వంతు సాయంగా రూ.25 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేస్తున్నట్లు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అంతేకాకుండా ఇలాంటి ఆపద సమయంలో అందరూ ముందుకు వచ్చి సహాయం చేయాలని పిలుపునిచ్చారు.

https://twitter.com/urstrulyMahesh/status/1466016888056549377?s=20

Advertisement

Next Story