పండుగ వేళ భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు

by Shyam |
cooking oils
X

దిశ, డైనమిక్ బ్యూరో : పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం సామాన్యుడికి ఉపశమనాన్నిచ్చే నిర్ణయం తీసుకుంది. రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరలు, గ్యాస్ బండ ధరలతో సతమతమవుతున్న ప్రజలకు వంట నూనె ధరలు తగ్గించి ఊరటనిచ్చింది. దిగుమతి అవుతున్న పామాయిల్, సోయా, సన్‌ఫ్లవర్ ఆయిల్స్ పై కస్టమ్స్ సుంకంతో పాటు అగ్రిసెస్‌ను కేంద్రం తగ్గించింది. ఈ నిర్ణయంతో భారీగా వంట నూనె ధరలు తగ్గనున్నాయి. కేంద్రం నిర్ణయంతో పామాయిల్‌పై అగ్రిసెస్‌ 7.5 శాతానికి, ముడి సోయాబిన్‌ ఆయిల్‌, ముడి పొద్దుతిరుగుడు నూనెపై 5.5 శాతాన్ని తగ్గించింది. అంతేకాకుండా రిఫైన్డ్‌ ఆయిల్ పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకాన్ని 32.5శాతం నుంచి 17.5శాతానికి తగ్గించారు. ఈ తగ్గింపు అక్టోబరు14న అమల్లోకి రానుంది.

Advertisement

Next Story