- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గతేడాది ఆధారంగా ‘కరెంట్ బిల్లులు’

దిశ, న్యూస్ బ్యూరో: 2019 ఏప్రిల్, మే నెలల్లో వచ్చిన బిల్లుల ఆధారంగానే లాక్‌డౌన్ కరెంట్ బిల్లులు ఇవ్వనున్నట్టు రాష్ట్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. విద్యుత్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించి బిల్లులు తీసే పరిస్థితి లేకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. లాక్‌డౌన్ తర్వాత మీటరు రీడింగ్ తీసినప్పుడు వచ్చే వినియోగాన్ని 30 రోజుల స్లాబుల వినియోగం ఆధారంగా బిల్ చేస్తారు. ఒకవేళ ఏప్రిల్, మే నెలల్లో తక్కువ విద్యుత్ వినియోగించి, ఎక్కువ చెల్లించినపుడు ఆ మేరకు రాబోయే బిల్లులో తగ్గిస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. చిన్నపరిశ్రమలు, వాణిజ్య సముదాయాల బిల్లుల్లో ఏప్రిల్‌లో ఇచ్చిన ప్రొవిజనల్ బిల్లును మినహాయించి నికర బిల్లులు జారీ చేయనున్నారు. విద్యుత్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించడం ద్వారా కొవిడ్-19కు దూరంగా ఉండాలని వినియోగదారులను విద్యుత్ శాఖ కోరింది. సమస్యలు ఏవైనా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 1912లో సంప్రదించాలని టీఎస్‌ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి సూచించారు.