ప్రీతీ జింతా కెరీర్‌ను డిసైడ్ చేసిన కాయిన్

by Jakkula Samataha |
ప్రీతీ జింతా కెరీర్‌ను డిసైడ్ చేసిన కాయిన్
X

దిశ, సినిమా: బ్యూటిఫుల్ హీరోయిన్ ప్రీతీ జింతా ఒకప్పుడు బాలీవుడ్‌ను ఏలేసింది. తెలుగులోనూ ‘రాజకుమారుడు’ ‘ప్రేమంటే ఇదేరా’ చిత్రాలలో తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ బిజినెస్‌లో బిజీగా ఉన్న ప్రీతి.. 46 వ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. అభిమానులు, స్నేహితులు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందిస్తున్నారు. కాగా, తన పుట్టినరోజు సందర్భంగా ఈ సొట్ట బుగ్గల సుందరి బాలీవుడ్ ఎంట్రీ ఎలా జరిగిందనే ఇంట్రెస్టింగ్ పాయింట్ తెలుసుకుందాం.

‘తారా రమ్ పమ్ పమ్’ సినిమాలో చేయాలని డైరెక్టర్ శేఖర్ కపూర్ ప్రీతిని అప్రోచ్ అయ్యారట. స్టోరీ ఇంప్రెసింగ్‌గా ఉన్నా..సినిమాను లైఫ్‌గా ఎంచుకోవచ్చా లేదా?.. ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేయొచ్చా? లేదా? అనే విషయాన్ని తేల్చుకోలేకపోయిందట. దీంతో కాయిన్ ఫ్లిప్ చేసి డిసైడ్ చేద్దామని అనుకుని.. హెడ్స్ పడితే సినిమా చేస్తానని టేల్స్ పడితే చేయనని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో కాయిన్ వేశాక హెడ్స్ రావడంతో సినిమాను కెరీర్‌గా ఎంచుకుందట. కానీ, ఈ ప్రాజెక్ట్‌కు సైన్ చేసినా పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టడంతో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘దిల్ సే’ సినిమా ద్వారా బాలీవుడ్‌కు పరిచయం అయింది ప్రీతి. ఆ తర్వాత ‘తారా రమ్ పమ్ పమ్’ చిత్రం మరో డైరెక్టర్, ఇతర నటులతో తెరపైకి రావడం గమనార్హం. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రీతి కాకుండా రాణి ముఖర్జీ ఫిమేల్ లీడ్‌లో కనిపించగా..సైఫ్ అలీ ఖాన్ హీరోగా నటించారు.

Advertisement

Next Story