- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘60 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలి’
దిశ ప్రతినిధి , హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 60 శాతం ఫిట్ మెంట్‌తో కూడిన పీఆర్సీ వెంటనే ప్రకటించాలని తెలంగాణ స్టేట్ మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఎస్ మెసా) సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీఎస్ మెసా రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ ఆహ్మద్ సీఎం కేసీఆర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఫారూఖ్ అహ్మద్ మాట్లాడుతూ… ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుండి 61 సంవత్సరాలకు పెంచాలని అన్నారు.
సీపీఎస్‌ను రద్ధు చేసి పాత పెన్షన్ విధానాన్ని తిరిగి అమలు చేయాలని తెలిపారు. జిల్లాలలో పని చేస్తున్న ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అమలు చేయాలని , ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని ,మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ సెలవులు ఇవ్వాలని సీఎంను కోరారు. అంతేకాకుండా టీఎస్ మెసా కార్యాలయం కోసం స్థలం కేటాయించాలని డిమాండ్ చేశారు.