'జాంబి రెడ్డి'పై డైరెక్టర్ వివరణ

by Jakkula Samataha |
జాంబి రెడ్డిపై డైరెక్టర్ వివరణ
X

ఈ మధ్య సినిమా పేరు లేదా సీన్‌లో కులం పేరు వినిపిస్తే చాలు.. మనోభావాలు దెబ్బతినేలా ఉంది, వెంటనే తొలగించాలంటూ ఆందోళనలకు దిగడం కామన్ అయిపోయింది. లేదంటే సినిమా ఆడనివ్వమని కూడా హెచ్చరిస్తున్నారు. బడా నాయకులను కలిసి చివరికి ఎలాగోలా టైటిల్ చేంజ్ చేస్తున్నారు కుల, మత పెద్దలు. ఇలాంటి పరిస్థితి తన సినిమా విషయంలో ఎదురు కాకూడదని జాగ్రత్త పడ్డారు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.

తొలి సినిమా ‘అ!’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన లేటెస్ట్ మూవీ జాంబి రెడ్డితో ఇంటర్‌నేషనల్ లెవల్‌లో గుర్తింపు వస్తుందని ధీమాతో ఉన్నారు. ఈ మధ్య జాంబి రెడ్డి టైటిల్ లోగో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అదే టైంలో తమ కులాన్ని కించపరిచేలా ఉందంటూ కొందరు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ప్రశాంత్ దృష్టికి రాగా దీనిపై వివరణ ఇచ్చాడు.

సినిమాలో ఏ కులాన్ని కించపరిచే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తెలుగులో తొలి జాంబి సినిమాగా వస్తున్న జాంబి రెడ్డి టైటిల్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందని.. యానిమేషన్ కోసం చాలా కష్టపడ్డామని చెప్పాడు. కరోనా నేపథ్యంలో సాగే కథలో.. ఈ మహమ్మారి నుంచి కోలుకున్న కర్నూలు ప్రజలు ప్రపంచాన్ని ఈ విపత్తు నుంచి ఎలా కాపాడారనేది స్టోరీ. అంతేకానీ కులాలు, మతాల గురించి సినిమాలో చూపించి కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు.

Advertisement

Next Story