అప్పుడు కేజ్రీవాల్, జగన్.. ఇప్పుడు మమత.. పీకే ప్లానా?

by Shamantha N |   ( Updated:2021-03-10 21:48:39.0  )
prasanth kishore
X

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా కింగ్ మేకర్‌గా పేరుపొందిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు మళ్లీ దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. తన మాస్టర్‌మైండ్, ఎన్నికల వ్యూహలతో ఎన్నో పార్టీలను అధికారంలోకి తీసుకొచ్చారు పీకే. దీంతో రాజకీయ పార్టీల్లో ఆయనకు బాగా డిమాండ్ ఏర్పడింది. ప్రతి పార్టీ ఆయననే ఎన్నికల వ్యూహకర్తగా నియమించుకుంటోంది. గతంలో కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్.. గత ఎన్నికల్లో ఏపీలో సీఎం జగన్‌ను అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ఇక గత ఢిల్లీ ఎన్నికల్లో అప్‌కు ఎన్నికల వ్యూహకర్తగా వ్యహరించిన పీకే.. ప్రస్తుతం పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో మమతాను అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్లాన్‌లు రూపొందిస్తున్నారు. ఎన్నికల్లో గెలవాలంటే చాలా వ్యూహలు రూపొందించాలి. అందులో పీకే పండిపోయాడని చెప్పవచ్చు.

ఇది ఇలా ఉంటే, బుధవారం పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై దాడి జరగడం చర్చనీయాంశమైంది. ఇది ప్రతిపక్షాల కుట్ర అని మమతా ఆరోపిస్తుండగా.. ఇదంతా డ్రామా అని ప్రతిపక్షాలు కొట్టిపారేస్తున్నాయి. ఎన్నికల వ్యూహంలో భాగంగా సానుభూతి కోసం ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ప్రకారం దాడి జరిగిందనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా జరుగుతోంది.

గత ఢిల్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్‌పై కూడా ఇలాగే దాడులు జరిగాయని, జగన్‌పై కూడా దాడి జరిగిన విషయాలను ప్రస్తావిస్తు్న్నారు. ప్రశాంత్ కిషోర్ ఆ పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన సమయంలోనే ఈ దాడులు జరగడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నాయకులకు ఎన్నికల్లో సానుభూతి కోసం ప్రశాంత్ కిషోర్ ప్లాన్ ప్రకారమే ఇలా దాడులు జరుగుతున్నాయనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారింది.

Advertisement

Next Story

Most Viewed