- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాంక్స్ మోడీ జీ : ప్రణీత
బాపు బొమ్మ ప్రణీత సుభాష్ అందం, అభినయంతో మాత్రమే కాదు సేవా గుణంతోనూ అభిమానులను సంపాదించుకుంది. ‘ప్రణీత సుభాష్ ఫౌండేషన్’ ద్వారా లాక్‌డౌన్‌లో ఎంతో మందికి అన్నంపెట్టి ఆదరించిన ఆమె.. తానే స్వయంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. దాదాపు నాలుగు నెలలు సేవా కార్యక్రమాలు కొనసాగించిన ప్రణీత.. ట్రాన్స్‌జెండర్స్‌ను కూడా ఆదుకుని శభాష్ అనిపించుకుంది. అంతేకాదు లాక్‌డౌన్‌లో ఇంతటి గొప్ప సేవా కార్యక్రమాలు కొనసాగించిన ఒకే ఒక్క హీరోయిన్‌గా మన్ననలు పొందింది.
అయితే గ్రామాల్లో రేషన్ కిట్స్‌తో పాటు శానిటరీ ప్యాడ్స్‌ను పంపిణీ చేసినప్పుడు వింత అనుభవం ఎదురైందని చెప్పింది ప్రణీత. రుతుస్రావం గురించి మహిళలు, పురుషులు ఒకే విధంగా, ఒకే దగ్గర మాట్లాడటం ఎంత నిషేధమో తెలుసుకున్నట్లు చెప్పింది. కానీ ఇండిపెండెన్స్ డే స్పీచ్‌లో స్వయంగా ప్రధాని మోడీ ఈ విషయంపై ప్రసంగించి ఈ నిషేధాన్ని విచ్ఛిన్నం చేసినందుకు ధన్యవాదాలు తెలిపింది ప్రణీత. ప్రజల ఆలోచనా వైఖరిలో మార్పు రావాలని కోరింది.
https://twitter.com/pranitasubhash/status/1294887350581858305?s=19