ప్రణబ్ ఆరోగ్యం క్షీణిస్తోంది

by Anukaran |
ప్రణబ్ ఆరోగ్యం క్షీణిస్తోంది
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందని ఢిల్లీ కంటోన్మెంట్ లోని ఆర్మీ ఆసుపత్రి వెల్లడించింది. బుధవారం తాజా హెల్త్ బులెటిన్ ను విడుదల చేసింది. ప్రణబ్ కు ప్రస్తుతం ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ కు సంబంధించి చికిత్స అందిస్తున్నామని తెలిపింది. ప్రస్తుతం కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని, అదేవిధంగా నిన్నటి నుంచి కిడ్నీ సంబంధ సమస్యలు కూడా ఎదురవుతున్నట్లు బులెటిన్ లో పేర్కొన్నది. కాగా, మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆగస్టు 10న ఆస్పత్రిలో చేరిన ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో ప్రణబ్ కు చికిత్స అందిస్తున్నారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed