మారుమూల గ్రామంలో పుట్టిన మార్గదర్శి

by Shamantha N |
మారుమూల గ్రామంలో పుట్టిన మార్గదర్శి
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రణబ్ ముఖర్జీ మన దేశానికి సేవలందించిన రాష్ట్రపతిగానే తెలుసు.. కానీ, ఆయన ఓ మారుమూల గ్రామంలో జన్మించినా.. ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలిచారు. సామాన్య కుటుంబంలో జన్మించిన ప్రణబ్ ముఖర్జీ తన విద్యాభ్యాసం కోసం 10 కిలో మీటర్లు నడిచేవారు. 1935 డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌ బిర్బుమ్ జిల్లా మిరాఠీలో జన్మించిన ప్రణబ్.. ఆ సమయంలో స్కూల్‌కు వెళ్లేందుకు సరైన సదుపాయాలు ఉండేవి కాదు.

దీంతో 10 కిలో మీటర్లు నడిచి స్కూల్‌కు వెళ్లే పరిస్థితి ఉండేదని ఆయన గుర్తు చేసుకున్నారు. వర్ష, వేసవి కాలంలో ఇంకా దారుణ పరిస్థితులు చవిచూసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ఎంతో మంది ప్రజలు ఆకలితో అల్లాడిపోయేవారన్నారు. కేవలం బెంగాల్‌లోనే 50 లక్షల మంది ఆకలి చావుకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 2013లో ఆయన రాష్ట్రపతిగా ఉన్న సమయంలో ఆహార భద్రతా బిల్లు తీసుకొచ్చిన సందర్భంగా ప్రణబ్ తన గతాన్ని గుర్తు తెచ్చుకున్నారు. ఇటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధాకరం.

Advertisement

Next Story

Most Viewed