మోడీపై ప్రకాశ్ రాజ్ ఫైర్.. సారీ చెప్తే సరిపోదంటూ

by Anukaran |   ( Updated:2021-11-21 04:39:09.0  )
మోడీపై ప్రకాశ్ రాజ్ ఫైర్.. సారీ చెప్తే సరిపోదంటూ
X

దిశ, వెబ్‌డెస్క్ : కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రవేశ పెట్టి మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్టు శుక్రవారం మోడీ కీలక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నాం, రైతులు ధర్నాలు ఆపేయాలని తెలిపారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు క్షమాపణలు కూడా తెలిపారు.

అయితే మోదీ నల్లచట్టాలు రద్దు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రైతు చట్టాల కారణంగా ఇప్పటికే 700 మంది రైతులు చనిపోయినా.. పట్టించుకోలేదని, కేవలం ఎన్నికల్లో గెలిచేందుకే బీజేపీ ఈ స్టంట్ వేసిందని పలువురు ఆరోపిస్తున్నారు. అలాగే కొంత మంది ఇది రైతుల విజయం అని పేర్కొంటున్నారు. ఎంతో మంది ప్రముఖులు చట్టాల రద్దుపై తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కూడా స్పందించారు. ప్రియ మైన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారు.. రైతుల కు చెప్పిన క్షమాపణలు సరిపోవు. రైతుల ఆత్మహత్యలకు బాధ్యత వహిస్తారా ? అంటూ ప్రశాష్‌ రాజ్‌ ఫైర్‌ అయ్యారు. అంతేకాకుండా కేటీఆర్‌ ట్వీట్‌‌ను ట్యాగ్‌ చేశారు.

దేశ ప్రజలకు కేంద్రం బిగ్ షాక్.. భారీగా పెరగనున్న ధరలు

Advertisement

Next Story