వంటలక్కగా ప్రగ్యా జైస్వాల్!

‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత కూడా పలు తెలుగు సినిమాలతో పాటు తమిళ , హిందీ సినిమాల్లో అవకాశాలు అందుకుంది. అయితే.. ఆ సినిమాలేవీ ఆశించనంత సక్సెస్ కాకపోవడంతో ఈ అమ్మడుకు అవకాశాలు సన్నగిల్లాయి. కాగా, లాక్‌డౌన్ వేళ మళ్లీ సినిమాల్లో అవకాశాలు దక్కించుకునేందుకు.. తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది భామ. అందుకోసం హాట్ హాట్ ఫొటోషూట్‌లతో ఇన్‌స్టాగ్రామ్‌లో హీట్ పుట్టిస్తోంది. అంతేకాదు ఈ బ్యూటీ.. తాజాగా యూట్యూబ్‌లో ఓ వంటల చానెల్‌ను మొదలుపెట్టింది.

సరికొత్త ఆలోచనతో తన అభిమానులందరినీ సర్‌ప్రైజ్ చేసింది. ఇన్‌స్టాలో తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అవకాశాలు లేకపోతేనేం.. తనే అవకాశాలు వెతుక్కుంటూ తోటి నటులకు సరికొత్త దారి చూపిస్తూ.. తన చానల్ ద్వారా తనకు ఇష్టమైన వెరైటీ వంటలను అభిమానులకు రుచి చూపిస్తోంది. ఈ క్రమంలోనే మొదటి రోజు.. జపనీస్ చీస్ కేక్‌ను తయారు చేసి చూపించింది ప్రగ్యా. మరి రుచి ఎలా ఉందో? ఏమో! సూపర్‌గానే ఉండి ఉంటుంది. మరోవైపు తను డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి కూడా అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ వెబ్ సిరీస్‌లో ప్రగ్యాకు అవకాశం వచ్చినట్లు సమాచారం. అంతేకాదు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో ఈమె పేరును పరిశీలిస్తున్నారు.

Advertisement